2, సెప్టెంబర్ 2011, శుక్రవారం

బాబు ఆస్తులు ఇవేనట.. ?


మొత్తం ఆస్తులు 39 కోట్ల 88 లక్షలు...ఇంతకంటే ఎక్కువగా ఉన్నాయని ఎవరు నిరూపిస్తే....వాళ్లకే ఇచ్చేస్తా....ఇవీ చంద్రబాబునాయుడు మాటలు.....కాకపోతే మార్కెట్ విలువ మాత్రం కాదన్నారు. ప్రకటించిన ఆస్తుల్లో తన భార్య, కొడుకు, కోడలు ఆస్తులు కూడా ఉన్నాయన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. తనకూ, కుటుంబ సభ్యులకు మొత్తం కలిపి 39 కోట్ల 88 లక్షల రూపాయల ఆస్తులు ఉన్నాయని చెప్పారు. చంద్రబాబు ఆస్తుల వివరాలు చూస్తే....23 లక్షల 20 వేల రూపాయల ఖరీదు చేసే ఇల్లు ఉందన్నారు. అయితే అది కూడా విజయ బ్యాంక్‌లో తాకట్టు పెట్టామన్నారు. సొంతకారు ఉందని...దాని విలువ లక్షా యా‍భై రెండు వేలని చెప్పారు. ఇక సేవింగ్ బ్యాంక్ ఎకౌంట్‌లో దాదాపు పదహారు లక్షల రూపాయలు ఉన్నాయన్నారు.
ఇక తన భార్య భువనేశ్వరి పేరు మీద దాదాపు 27 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని బాబు చెప్పారు. హైదరాబాద్ పంజగుట్టలో 650 గజాల స్తలం ఉందనీ....దాని విలువ 73 లక్షల 33 వేలని చెప్పారు. తమిళనాడులో 23 ఎకరాల యాభైవేల గజాల భూమి ఉందనీ..దాని విలువ కోటి 86 లక్షలని చెప్పుకొచ్చారు. అయితే అది యూకో బ్యాంక్ తాకట్టులో ఉందన్నారు. హైదరాబాద్ మదీనాగూడలో ఐదు ఎకరాల పొలం ఉందనీ....దాని ధర 73 లక్షల 80వేల రూపాయలని చెప్పారు. అదీ కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా తాకట్టులో ఉందన్నారు. ఇక హెరిటేజ్‌లో 19 కోట్ల 95 లక్షల 49 వేలు పెట్టుబడి పెట్టారనీ....నిర్వాణ హోల్డింగ్స్‌లో పదమూడు కోట్ల 77 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారనీ బాబు చెప్పారు. తన భార్యకు 65 లక్షల 44 వేల పీఎఫ్ బ్యాంక్‌లో ఉందనీ....26 లక్షల 96 వేల బంగారం, నాలుగున్నర లక్షల వెండి, 91 లక్షల ఖరీదు చేసే కారుతో పాటు కొద్ది మొత్తంలో బ్యాంక్ బాలెన్స్ ఉందని చెప్పుకొచ్చారు. లోకేష్‌కు ఆరు కోట్ల 73 లక్షల ఆస్తులు ఉన్నాయనీ....కోడలు బ్రహ్మిణి పేర మూడు కోట్ల 22 లక్షల ఆస్తులు ఉన్నాయనీ చంద్రబాబు చెప్పుకొచ్చారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి